![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యేసరికి ఇప్పుడు బిగ్ బాస్ ఫాన్స్ అంతా కూడా ఓటిటి సీజన్ 2 గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు వస్తున్నారు అని. ఇప్పటికే ముగిసిన బిగ్ బాస్ "ఓటిటి" సీజన్ 1 కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ దిశగానే ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఐతే ఇన్స్టాగ్రామ్ లో బిగ్ బాస్ అఫీషియల్ పేజీతో కొంతమంది నెటిజన్స్ చాట్ చేయగా కొన్ని విషయాలు తెలిసాయి. "నాన్ స్టాప్ 2 ఓటిటి అంటే ఏమిటి బ్రో" అని అడిగేసరికి "అన్ని బిగ్ బాస్ సీజన్స్ లనే ఉంటుంది.
ఐతే ఇది కేవలం ఓటిటి ప్లాటుఫారం మీద అంటే హాట్ స్టార్ లో వస్తుంది. 24 / 7 లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. 14 - 16 మంది కంటెస్టెంట్స్ 80 రోజుల పాటు హౌస్ ఉండి గేమ్ ఆడతారు. ఇక ఇందులో పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ కూడా ఉంటారు.. చాలెంజర్స్ వెర్సెస్ వారియర్స్" అని రిప్లై ఇచ్చారు. "ఓటిటి సీజన్ కి ఇప్పుడు ఎవరెవరు వస్తారు.. అఖిల్ రన్నర్ కదా అతన్ని పిలిచారు.. అమర్ దీప్ వస్తాడా.." అనేసరికి "అఖిల్ బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత మంచి ఆఫర్స్ రాక వచ్చాడు. ఐతే అమర్ రెండు సినిమాలకు సైన్ చేసాడు.
అలాగే రవితేజతో ఇంకో మూవీకి కూడా సైన్ చేసాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో బిగ్ బాస్ ఓటిటికి ఎలా వస్తాడు. నో ఛాన్స్" అని చెప్పారు. "ఓటిటి సీజన్ 2 కంటెస్టెంట్స్ లిస్ట్ త్వరలో బయటకు వస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 వచ్చే నెల చివరికంటా మొదలవుతుంది. ఈ సీజన్ కి వెళ్లేవాళ్లు పేర్లు కూడా చాలానే బయటకు వచ్చాయి. మరి అందులో కొత్త వాళ్లు ఎవరు వెళ్తున్నారు..వాళ్ళతో వెళ్లే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.
![]() |
![]() |